తెలుగు - వెలుగు ( Telugu - Velugu )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 21, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మృణాలిని గారు ...
    మీరు చెప్పినది నిజమే ... కానీ ఇక్కడ సరిగా telugu రానివారు కూడా ఉంటారు కదా , మాట్లాడటం మాత్రమె వచ్చినవారు ...
    సైగా అర్దము చేసుకోలేని వారు కూడా ఉంటారు కదా అని నా ఉద్దేశము ....

     
  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    చతుర్వేదాలు :

    హిందూధర్మమునకు వేదములే మూలము. వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటె ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపబడినవి.

    ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండ యనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాది కర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది.


    ఒక్క పరబ్రహ్మమును తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపమును నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు.


    మంత్రదష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలుకారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పబడినవి.


    వేదవ్యాసుడు ఈ వేదములను నాలుగుగా విభజించెను.


    1. ఋగ్వేదము :
    ఋగ్వేద దేవత తెల్లని రంగు గలది. దీనికి రెండు చేతులుండును. దీని ముఖము గాడిద ముఖము. అక్షరమాలను ధరించి సౌమ్య ముఖముతో, ప్రీతిని ప్రకటించుచు, వ్యాఖ్యానము చేయు యత్నములో నుండును. దీనిలో 21 శాఖలు ఉన్నవి. ఇది మంత్రములతో కూడుకొన్నది. ఇందులోని మంత్రములు ఇంద్రాది దేవతలను (స్తుతించుట జరిగినది) స్తుతించినవి.

    2. యజుర్వేదము :

    యజుర్వేద దేవత మేక ముఖము కలదై పసుపుపచ్చని రంగుతో, జపమాలను ధరించి, ఎడమ చేతితో వజ్రాయుధమును ధరించి, ఐశ్వర్యమును, శుభమును ప్రసాదించుచుండును. దీనిలో 101 శాఖలు ఉన్నవి. గద్యము లన్నింటిని సేకరించినవి ఇందులోని శ్లోకములు (మంత్రములు)


    3. సామవేదము
    :

    సామవేద దేవత నల్లకలువరేకువలే నిగనిగలాడుతూ, నీలశరీరముతో గుర్రము ముఖముతో, కుడిచేతితో అక్షరమాలను, ఎడమచేతితో కుండను (పూర్ణ కుంభమును) ధరించియుండును. దీనిలో 1009 శాఖలు ఉన్నవి. గేయ రూపములోనున్న మంత్రములు సంగీతమునకు సంబంధించినవి.

    4. అధర్వవేదము :

    అధర్వవేదదేవత తెల్లని రంగుతో, కోతిముఖముతో, ఎడమచేతిలో జపమాలతో, కుడిచేతిలో (పూర్ణ కుంభము) కుండతో విలసిల్లుచుండును. దీనిలో 9 శాఖలు ఉన్నవి. మిగిలినవన్ని ఇందులో చెప్పబడినవి.


    ఉపవేదాలు :

    ప్రతి యొక్క వేదానికి ఉపవేదాలు ఉన్నాయి.

    1. ఋగ్వేదమునకు ఉపవేదం ఆయుర్వేదము.
    2. యజుర్వేదమునకు ఉపవేదం ధనుర్వేదము.
    3. సామవేదమునకు ఉపవేదం గాంధర్వ వేదము.
    4. అధర్వణవేదమునకు ఉపవేదం స్థాపత్య శాస్త్ర వేదము.
     
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male

    పురాణాలు :


    "పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.

    పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. మన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ ప్రబంధాలన్నీ పురాణాలలోంచే ముడి సరుకుని తీసుకున్నాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామక్రుష్ణుడు తన పాండురంగ మహాత్యానికి స్కాంద పురాణమే ఆధారమన్నాడు. రాయల వారు అముక్తమాల్యదలోని కొన్ని కథలను విష్ణు పురాణం నుంచి తీసుకున్నాడు.


    మానవ జీవితానికి కావలసిన శాస్త్ర విషయాలను పురాణాలలో మన ఆదిమ ఋషులు చేర్చేవారు. ఋషి ప్రోక్తాలు కాబట్టే పురాణాలను కూడా వేదాలలాగే ప్రమాణద్రుష్టితో చూసేవారు. నిజానికి మనకు వేదకాలంలో కూడా పురాణ సాహిత్యం ఉంది. అధర్వ వేదం పురాణాన్ని పేర్కొంది. ఉపనిషత్తులు కూడా పురాణ ప్రాముఖ్యాన్ని శ్లాఘించాయి. వేద కాలం నాటి పురాణ సమ్హితలో 4 వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి. అవి నేటికి పెరిగీ పెరిగీ కొన్ని లక్షల స్లోకాలుగా పరిణామం చెందాయి. 18 మహా పురాణాలలోని శ్లోకాలు 4,11,000 అని లెక్కతేలుతున్నాయి. ఉప పురాణాల శ్లోక సంఖ్య అంచనా కట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు.


    సిద్ధాంతాల ఘాటునుబట్టి పురాణాలను సాత్విక, తామస, రాజస పురాణాలని 3 గుణాలవారీగా వర్గీకరించవచ్చు. పురాణంలోని ప్రతి ఒక్క కథకూ ఫలశ్రుతి చెప్పారు. ఫలానా ఫలం కావాలంటే ఫలానా నోము నోచమన్నారు. ప్రతి పురాణాన్నీ వ్యాసుడు వ్రాస్తే దాన్ని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహా మునులకు చెప్పాడు. అయితే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పంలో పుడుతుంది. కల్పమంటే బ్రహ్మ దినం. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మకల్పం అన్నమాట.


    విశ్వము యొక్క సృష్టి స్ధితి లయములు, రాజవంశములు మున్నగు వాని చరిత్రములను పురాణములు వివరించును. మరియు భగవంతు డొనర్చు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణములను, మనుజులు పాటింపవలసిన ధర్మములను, ఆధ్యాత్మిక సాధనలను పురాణములు ప్రబోధించుచున్నవి. పవిత్ర క్షేత్రములు, తీర్ధస్ధలములు మున్నగువాని మహత్యములను గూడ పురాణములలో వర్ణింపబడినవి.


    శబ్దప్రధానములైన వేదములు ఏ విషయములను ప్రభువువలె శాసించునో ఆ విషయములనే అర్ధ ప్రధానములైన పురాణములు మిత్రుని వలె కథలద్వారా మనకు తెలియపరచును. అందువలన హిందూ సాహిత్యములో పురాణములు మిక్కిలి ప్రధానములై యున్నవి.


    అష్టాదశ పురాణాలు :

    1. మత్స్య పురాణము
    2. మార్కండేయ పురాణము
    3. భాగవత పురాణము
    4. భవిష్య పురాణము
    5. బ్రహ్మ పురాణము
    6. బ్రహ్మాండ పురాణము
    7. బ్రహ్మ వైవర్త పురాణము
    8. వరాహ పురాణము
    9. వామన పురాణము
    10. వాయు పురాణము
    11. విష్ణు పురాణము
    12. అగ్ని పురాణము
    13. నారద పురాణము
    14. స్కంద పురాణము
    15. లింగ పురాణము
    16. గరుడ పురాణము
    17. కూర్మ పురాణము
    18. పద్మ పురాణము





    1.మత్స్య పురాణము :

    దీనిలో 1400 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడినవి.

    2.మార్కండేయ పురాణము:

    ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హొమము, శతచండీ, సహస్ర చండీ హొమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే.

    3.భాగవత పురాణము
    :

    దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి.

    4.భవిష్య పురాణము
    :

    దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.

    5.బ్రహ్మపురాణము
    :

    దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గూర్చి వివరించబడినవి.


    6.బ్రహ్మండ పురాణము
    :

    దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.

    7.బ్రహ్మ వైవర్త పురాణము
    :

    దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడింది.

    8.వరాహ పురాణము
    :

    దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతార మెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు. పుణ్యక్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.

    9.వామన పురాణము
    :

    దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము - ఋతు వర్ణనలు వివరించబడినవి.

    10. వాయు పురాణము
    :

    దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.


    11. విష్ణు పురాణము
    :

    ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహత్మ్యము, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.

    12. అగ్ని పురాణము
    :

    దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.

    13. నారద పురాణము
    :

    ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివస్తోత్రము) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.

    14.స్కంద పురాణము
    :

    దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు)చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహ్మొత్తర ఖండము (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహకాల మహత్మ్యము) మొదలగునవి కలవు.

    15.లింగ పురాణము
    :

    ఇది శివుని ఉపదేశములు, లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతోపాటు వ్రతములు. ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.

    16.గరుడ పురాణము
    :

    ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహవిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ - నరక ప్రయాణములు తెలుపబడినది.

    17.కూర్మ పురాణము
    :

    ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నరసింహావతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.

    18.పద్మ పురాణము
    :

    ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్ధసారం - పఠనమహత్మ్యం, గంగామహత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహత్మ్యం, పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలుయజేయబడింది.
     
  4. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    కాలచక్రం :

    1. కాలగణనం
    2. రోజులు
    3. వారాలు
    4. పక్షాలు
    5. నెలలు
    6. ఋతువులు - కాలాలు
    7. సంవత్సరాలు
    8. తిధులు
    9. నక్షత్రాలు
    10. రాశులు
    11. క్యాలండర్



    ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం :


    1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం

    1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు

    1 త్రుటి = 1 లవము, లేశము

    2 లవములు = 1 క్షణం

    30 క్షణములు = 1 విపలం

    60 విపలములు = 1 పలం

    60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు)

    2.5 చడి = 1 హొరా (ఒక గంట)

    24 హొరా = 1 దినం

    రెప్ప పాటుకాలం = 1 సెకను

    60 సెకన్లు = 1 నిమిషం


    60 నిమిషాలు = 1 గంట


    24 గంటలు = 1 రోజు లేక దినం


    7 దినములు = ఒక సప్తాహం, వారం


    15 రోజులు = 1 పక్షము


    4 సప్తాహాలు = 1 నెల


    2 నెలలు = 1 ఋతువు


    2 ఋతువులు = 1 కాలం


    6 ఋతువులు = ఒక సంవత్సరం


    100 సంవత్సారాలు = ఒక శతాబ్దం


    10 శతాబ్దాలు = ఒక సహస్రాబ్దం


    432 సహస్రాబ్దాలు = 1 యుగం


    2 కలియుగాలు = ఒక ద్వాపరయుగం


    3 ద్వాపరయుగాలు = ఒక త్రేతాయుగం


    4 త్రేతాయుగాలు = ఒక కృతయుగం లేదా సత్వయుగం


    10 యుగాలు = ఒక మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాలు)


    1000 మహాయుగాలు = ఒక కల్పం 43 కోట్ల 23 లక్షల వత్సరాలు



    2.రోజులు
    :

    సూర్యుడు ఉదయించినది మొదలు అస్తమించే వరకు గల కాలం పగలు.

    సూర్యుడు అస్తమించినది మొదలు మరల ఉదయించే వరకు గల కాలం రాత్రి.


    ఒక పగలు, ఒక రాత్రి కలసి ఒక రోజు.


    ఏడు రోజులు ఒక వారం.


    ౩.వారాలు :

    1. ఆదివారము, Sunday
    2. సోమవారము, Monday
    3. మంగళవారము, Tuesday
    4. బుధవారము, Wednesday
    5. గురువారము, Thursday
    6. శుక్రవారము, Friday
    7. శనివారము, Saturday

    4.పక్షాలు :

    పదిహేను రోజులు ఒక పక్షం

    అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని


    పౌర్ణమి వెళ్లిన దగ్గరి నుంచి అమావాస్య వచ్చే వరకు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం అంటారు.


    కనుక నెలకు రెండు పక్షాలు ఉంటాయి.


    పక్షానికి పదిహేను తిధులు:


    1. పాడ్యమి
    2. విదియ
    3. తదియ
    4. చవితి
    5. పంచమి
    6. షష్ఠి
    7. సప్తమి
    8. అష్టమి
    9. నవమి
    10. దశమి
    11. ఏకాదశి
    12. ద్వాదశి
    13. త్రయోదశి
    14. చతుర్దశి
    15. పూర్ణిమ లేక అమావాస్య


    5. నెలలు:

    1. చైత్రము
    2. వైశాఖము
    3. జేష్టము
    4. ఆషాఢము
    5. శ్రావణము
    6. భాద్రపదము
    7. ఆశ్వీజము
    8. కార్తీకము
    9. మార్గశిరము
    10. పుష్యము
    11. మాఘము
    12. ఫాల్గుణము

    6.ఋతువులు -- కాలాలు :

    సంవత్సరానికి ఆరు ఋతువులు

    వసంత ఋతువు ---- చైత్ర,, వైశాఖ మాసాలు

    గ్రీష్మ ఋతువు ------ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
    వర్ష ఋతువు -------- శ్రావణ, భాద్రపద మాసాలు
    శరత్ ఋతువు -------- ఆశ్వయుజ, కార్తీక మాసాలు
    హేమంత ఋతువు ------- మార్గశిర, పుష్య మాసాలు
    శిశిర ఋతువు --------- మాఘం, ఫాల్గుణం మాసాలు

    7. కాలములు
    :

    రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...

    1. వేసవి కాలం
    2. వర్షా కాలం
    3. శీతా కాలం


    వేసవి కాలం ------- చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.

    వర్షా కాలం -------- శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.


    శీతా కాలం -------- మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.



    8 .తెలుగు సంవత్సరాలు
    :


    1. ప్రభవ
    2. విభవ
    3. శుక్ల
    4. ప్రమోదూత
    5. ప్రజోత్పత్తి
    6.అంగీరస
    7. శ్రీముఖ
    8. భావ
    9. యువ
    10. ధాత
    11. ఈశ్వర
    12. బహుధాన్య
    13. ప్రమాది
    14. విక్రమ
    15. వృష
    16. చిత్రభాను
    17. స్వభాను
    18. తారణ
    19. పార్ధివ
    20. వ్యయ
    21. సర్వజిత్తు
    22. సర్వధారి
    23. విరోధి
    24. వికృతి
    25. ఖర
    26. నందన
    27. విజయ
    28. జయ
    29. మన్మథ
    30. దుర్ముఖి
    31. హేవిళంబి
    32. విళంబి
    33. వికారి
    34. శార్వరి
    35. ప్లవ
    36. శుభకృతు
    37. శోభకృతు
    38. క్రోధి
    39. విశ్వావసు
    40. పరాభవ
    41. ప్లవంగ
    42. కీలక
    43. సౌమ్య
    44. సాధారణ
    45. విరోధికృతు
    46. పరీధావి
    47. ప్రమాదీచ
    48. ఆనంద
    49. రాక్షస
    50. నల
    51. పింగళ
    52. కాలయుక్త
    53. సిద్ధార్ధి
    54. రౌద్రి
    55. దుర్మతి
    56. దుందుభి
    57. రుధిరోద్గారి
    58. రక్తాక్షి
    59. క్రోధన
    60. అక్షయ



    9.నక్షత్రాలు :


    నక్షత్రాలు ఇరువై ఏడు

    1. అశ్విని
    2. భరణి
    3. కృత్తిక
    4. రోహిణి
    5. మృగశిర
    6. ఆర్ద్ర
    7. పునర్వసు
    8. పుష్యమి
    9. ఆశ్లేష
    10. మఖ
    11. పుబ్బ
    12. ఉత్తర
    13. హస్త
    14. చిత్త
    15. స్వాతి
    16. విశాఖ
    17. అనూరాధ
    18. జ్యేష్ఠ
    19. మూల
    20. పుర్వాషాఢ
    21. ఉత్తరాషాఢ
    22. శ్రవణం
    23. ధనిష్ఠ
    24. శతభిషం
    25. పూర్వాభాద్ర
    26. ఉత్తరాభాద్ర
    27. రేవతి

    10 .రాశులు
    :

    రాశులు పన్నెండు

    1.మేషం, Aries

    2.వృషభం, Taurus
    ౩.మిధునం, Gemini
    4.కర్కాటకం, Cancer
    5.సింహం, Leo
    6.కన్య, Virgo
    7.తుల, Libra
    8.వృశ్చికం, Scorpio
    9.ధనస్సు, Sagattarius
    10.మకరం, Capricorn
    11.కుంభం, Aquarius
    12.మీనం, Pisces




    11.క్యాలెండర్ కథ
    :


    మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. ఆ కేలెండెర్ ఎలా సృష్టించబడిందీ, ఎవరు, ఎలా, ఏ కాలంలో రూపకల్పన చేశారూ, నేటి కేలెండెర్ రూపానికి అది చేరుకోడానికి ఎన్ని మార్పులు చెందిందీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎన్నో మార్పులూ, చేర్పులూ, ఎన్నెన్నో వింతలూ, విశేషాలతో ఏర్పడ్డ విశేషమే మనం వాడుతున్న ప్రస్తుత కేలెండెర్. ఆ రూపకల్పన పాతబడని విశేషమే కదా మనకి. కొత్త సంవత్సరం కొత్త కేలెండెర్ని ఎప్పుడుప్పుడు చూద్దామా అని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే మీకు అసలా కేలెండెర్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని అంతే ఉత్సాహంగా ఉంది కదూ? ఐతే వెంటనే ఆ కేలెండెర్ కథలోకి వెళ్ళిపోదాం.

    అతి ప్రాచీనకాలం నుంచీ రాత్రీ పగలూ, రాత్రీ పగలూ ఒక దాని వెనుక ఒకటి వస్తూండడం గమనిస్తూ వచ్చాడు మానవుడు. కాలగణనానికి అదొక అనువైన ప్రమాణంగా తోచింది. ఈనాటి సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకూ ఒక పగలూ, ఒక రాత్రీ కలిపి ఒక రోజుగా భావించి లెక్కలు కట్టడం ప్రారంభించాడు.


    ఆ నాటి సగటు మానవ జీవితం 30 సంవత్సరాలే అనుకున్నా, రోజుల్లో లెక్కడితే 11 వేల రోజుల పైనే అనుకున్నా అయ్యేది. ఇన్ని రోజులు ఒకదాని తరువాత ఒకటి లేక్కపెట్టడంలో ఏన్నో తప్పులు వచ్చేవి. రోజు కంటే పెద్ద కాల ప్రమాణం అవసరం పెరిగింది. చందమామ అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వృద్ది చెందటం, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా క్షీణిస్తూ ఉండటం గమనించిన మానవుడికి ఒక అమావాస్య నుంచి మరుసటి అమావాస్య దాకా ఉన్న కాలం మరొక ప్రమాణంగా ఏర్పడింది.ఇది సుమారు ఇరవై తొమ్మిదిన్నర రోజులు. దీన్ని 'నెల ' అంటారు.మానవ జీవిత ప్రమాణం తెలియడానికి 11 వేల రోజులు లెక్కపెట్టనక్కర లేదు.360 నెలలు లెక్కిస్తే చాలు.


    మానవుడు జంతువులను వేటాడుతూనో, పశువుల్ని మేవుకుంటూనో, దేశ ద్రిమ్మరిగా తిరిగే రోజుల్లో మాసానికి విశేష ప్రాముఖ్యం లేకపోయింది. అయితే వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచీ స్థిర జీవితానికి అలవాటు పడ్డాడు. వ్యవసాయం మీద ఋతువుల ప్రభావం ఎంతో ఉంది, సరైన ఋతువులో గింజలు చల్లాలి. వర్షాలు పడే రోజు చుసుకొని పంటలు వేయ్యాలి. లేకపోతే అంతా నాశనమే! ఈ కారణం చేత ఎండాకాలం ఎప్పుడొస్తుందో, తొలకరి ఎప్పుడు ప్రారంభమవుతుందో, శీతాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరంగా తెలియాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఋతువు ప్రారంభంలో గింజలు చల్లితే, ఆ సంవత్సరం పంటలు బాగా పండితే, 12 నెలల తర్వాత మళ్లీ అదే ఋతువు ప్రారంభంలో మళ్ళీ గింజలు చల్లవచ్చని రైతు దైర్యంగా ఉంటాడు.



    12 చంద్ర మాసాలు 354 రోజులకు సమానం.కాని, ఇవి రుతుచక్రంతో సమానంగా నడవ్వు. ఈ రోజు వసంత ఋతువు ప్రారంభమనుకోండి. 12 చంద్ర మాసాల తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం తిరిగి వసంత ఋతువుతో ప్రారంభమైతే ఏ ఇబ్బంది. ఉండేది కాదు. నెలకొక్కొక్క రాశి చొప్పున సూర్యుడు ఒక సంవత్సరంలో పన్నెండు రాశులూ తిరిగి మళ్లీ తన ప్రస్థానం ప్రారంభిస్తాడు. రుతు చక్రం కూడా సూర్య గమనంతో సరిగ్గా తిరుగుతుంది. చంద్ర గమనంతో కాదు. సూర్యుడు 12 నక్షత్ర రాశుల్నీ సరిగ్గా 365.25 రోజుల్లో చుట్టి వస్తాడు. దీన్ని సౌర సంవత్సరం అంటారు.


    ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే ఈజిప్టు దేశస్థులకు చంద్ర కళల మీద కంటే, రుతుచక్రం మీదనే ఆసక్తి ఎక్కువ. ఆ దేశస్థుల జీవనాధారం నైలు నది. నైలు నది వరదలతో వారి ఎడారి భూముల సస్యశ్యామలాలయ్యాయి. ఈవరదలు 365 రోజులకొక సారి వచ్చేవి. వారు సవత్సర కాలాన్ని ఆధారంగా తీసుకొని కేలండరు తయారు చేసుకున్నారు. దీన్ని 12 నెలలుగా విభజించారు. నెలకి 30 రోజుల చొప్పున 360 రోజులు పోగా, మిగిలిన 5 రోజులూ పండుగ రోజులూగా భావించి, ఆ తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం లెక్కకట్టేవారు. సూర్యుడి గతి మీద ఆధారపడ్డ సౌర సంవత్సరం 365.25 రోజులు కావడంతో నైలు నది వరదలు సంవత్సర ప్రారంభం నుంచి నెమ్మది నెమ్మదిగా అలస్యంగా వస్తూ వచ్చాయి.


    గ్రీకు విజ్ఞాని యూడోక్సస్ క్రీ.పూ. 380 ప్రాంతంలో సంవత్సరం పొడవులోని ఈ ఆరు గంటల వ్యత్యాసాన్ని కనుగొన్నాడు. ఈజిప్టుని పాలిస్తున్న మాసిదోనియా రాజు టోలెమీ ఈ తేడాని గుర్తులో ఉంచుకొని కేలండరులో మార్పులు తేవాలని ప్రయత్నించాడు.కాని చాందస ఈజిప్షియన్ పురోహితులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.


    రోమన్లు సౌర, చాంద్రమాన పద్థతులను కలిపి ఒక కేలండరు ఏర్పాటు చేసుకున్నారు . మొదట్లో వారి సవత్సరానికి పది నెలలే ఉండేవి. మొదటి నాలుగు నెలలూ, వారి దేవుళ్ళ పేరిట; మర్షియస్, ఏప్రిలిస్, మెయస్, జూనియస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మాసాలకు సంఖ్యానామాలిచ్చారు. అవి, క్వింటిలిస్ (ఐదవది), సెక్సటిలిస్ (ఆరవది), సెప్టెంబర్ ?(ఏడవది), అక్టోబర్ (ఎనిమిదవది), నవంబర్ (తొమ్మిదవది), డిశంబర్(పదవది). వారి సంవత్సరం మార్చిన ప్రారంభం అయ్యేది. రోమన్ రిపబ్లిక్*కి ఏడాదికొకసారి ఎన్నికలు జరిగేవి. రోమను పురోహితులు తమకు అనుకూలమైనవారు పదవిలో ఉంటే సంవత్సరానికో అధికమాసం తగిలించేవారు. వ్యతిరేకులు పదవిలో ఉంటే మానేసేవారు. ఈ విధంగా వారి కేలండరు అస్తవ్యస్తంగా తయారయ్యేద. క్రీస్తుపూర్వం 46వ సంవత్సరం నాటికి సూర్యుడు గతికీ, వారి కేలండరుకీ 80 రోజుల దాకా వ్యత్యాసం ఏర్పడింది.


    అప్పుడే ఈజిప్టునించి తిరిగి వచ్చిన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజరు ఈ గందరగోళమంతా చూసి, కేలండరు సంస్కరణకి పూనుకున్నడు. సౌర సంవత్సరం పొడవు 365.25 రోజులుగా గుర్తించాడు. అప్పటి దాకా ఉన్న పది నెలలకీ జనవరి, ఫిబ్రవరి అనే మరో రెండు మాసాలను చేర్చాడు.


    మార్చి 1వ తేదీ బదులు, జనవరి 1వ తేదీని సంవత్సరం ప్రారంభం కావాలన్నాడు. నెలకీ 30 రోజుల చొప్పున 12 నెలలకీ 360 రోజులు. పోగా మిగిలిన 5 రోజులూ వీటిలో 5 నెలలకు సర్దాడు.ఈ లెక్కన 5 నెలలకు 31 రోజులు, 7 నెలలకు 30 రోజులూ ఉండాలి. కాని రోమన్లకు ఫిబ్రవరి అచ్చిరాని మాసం. అందుచేత దానిలో ఒక రోజు తీసి మరో నెలకు చేర్చాడు. ఈ విధంగా ఆరు మాసాలు 31 రోజులతోటీ, 5 మాసాలు 30 రోజులతోటీ, ఒక మాసం 29 రోజులతోటీ ఏర్పడ్డాయి. జనవరి 31, ఫిబ్రవరి 29 ,మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, క్వింటిలిస్ 31, సెక్సిటిలిస్ 30, సెప్టెంబరు 30, అక్టోబరు 31, నవంబర్ 30, డిసెంబర్ 31 రోజులతో,మొత్తం 365 రోజులూ పూర్తి అయ్యాయి. అయితే, సంవత్సరానికి పావు రోజు చొప్పున 4 సంవత్సరాలలో ఒక రోజు మిగిలిపోతుంది. అందుచేత ప్రతి నాలుగో సవత్సరానికీ 365 రోజుల బదులు 366 రోజులు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును ఫిబ్రవరి మాసానికి కలిపి ఫిబ్రవరిలో 29 రోజులకి బదులు 30 రోజులు ఉండాలని నిర్ణయమైంది.


    సంవత్సరానికి 365 రోజులుంటే 52 వారాల ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరి 10 వ తేదీ ఈ సంవత్సరం ఆదివారమైతే, మరుసటి సంవత్సరం అది సోమవారమూ, ఆ తరువాత సంవత్సరం మంగళవారం అవుతూ వస్తుంది. 366 రోజులుంటే 52 వారాల 2 రోజులు, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారమయి, ఇది 366 రోజుల సంవత్సరమయితే పై సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారమవుతుంది. ఒక రోజు దాటేసి, గెంతేసి, లీప్ చేసి అయిందన్న మాట. అందుచేత అటువంటి సంవత్సరాన్ని 'లీప్ ఇయర్ ' అంటారు. ఈవిధంగా 4 సంవత్సరాలకు ఒక సారి 'లీప్ ఇయర్ ' వస్తుంది.


    ఇంత కష్టపడ్డందుకు ప్రతిఫలంగా తన పేరు అచంద్రార్కం నిలిచిపోయేందుకు 'క్వింట్*లిస్ ' మాసాన్ని తన పేరిట జులై మాసంగా మార్చేశాడు జూలియస్ సీజర్. ఈ కేలెండరు అమలులోకి వచ్చే ముందు క్రీ.పూ. 46వ సంవత్సరానికి 445 రోజులు ఏర్పాటు చేసి, ఆ తర్వాత నుంచే కొత్త కేలెండర్ని అమలులోకి తెచ్చేడు. ఈ విధంగా దారి తప్పిపోయిన రోమను కేలండర్ని క్రమబద్ధం చేశాడు జూలియస్ సీజర్. అప్పటి నుంచి ఈ కేలండర్ని ' జూలియస్ కేలండర్ ' అని పలిస్తూ వచ్చాడు.


    జూలియస్ సీజరు తరువాత సీజర్ అగస్టస్ పరిపాలనకు వచ్చాడు.' జూలియస్ సీజర్ సంవత్సరంలోని ఒక మాసానికి తన పేరు పెట్టుకోగా లేనిది నేనెందుకు పెట్టుకోకూడదు? 'అనుకున్నాడు. సెక్స్*టిలియస్ మాసానికి తన పేర ' ఆగస్టు ' అని పేరు పెట్టాడు. ' వీధుల పేర్లూ, నగరాల పేర్లూ తమకనుకూలంగా మాచ్చేసే పద్థతి ఈ నాటిదికాదు. రెండు వేల సంవత్సరాల పూర్వం నించీ ఉంది. పేరైతే మార్చాడు ఆగస్టస్ చక్రవర్తి. కాని జులై మాసానికి 31 రోజులుంటే ఆగస్టుకు 30 రోజులే వచ్చాయి. దాంతో తల కొట్టేసినట్లయ్యింది అతనికి. ఇది పని కాదని, ఫిబ్రవరి మాసంలోని 29 రోజులలో ఒక రోజు తీసివేసి ఆగస్టుకు కలిపేసి దానికి 31 రోజులు చేశాడు. రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కాదవా ? ఈ విధంగా ఫిబ్రవరి నెలకు 28 రోజులే మిగిలాయి, అప్పటినుంచి లీపు సంవత్సరంలో మాత్రం 29 రోజులుంటాయి.


    నికేయా నగంలో జరిగిన క్రైస్తవ చర్చి కౌన్సిల్ జూలియన్ కేలండర్ని ఆమోదించింది. అప్పటినుంచి డిసెంబర్ 25 వ తేదీ క్రిస్టమస్ పండుగగా స్థిరపడిపోయింది.




    సౌర సంవత్సరం 365 1/4 రోజులయితే ఈ కేలండరు ఏ అవాంతరమూ లేకుండా సాగిపోయేది. కథ కంచికి వెళ్ళేది. కాని సౌర సంవత్సరం పొడవు సరీగా 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు. లేదా 365,24220 సవత్సరాలు ఈ లెక్కని సౌర సంవత్సరం కంటె జూలియన్ సంవత్సరం సగటున 11 నిముషాల 14 సెకన్లు పెద్దది. ఈ తేడా స్వల్పమే అయినా కొన్ని శతాబ్దాలు గడిచేటప్పటికి పెద్దదౌతుంది. 128 సంవత్సరాలలో సౌర సంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం ఒక రోజు పెద్దదవుతుంది.


    సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖని దాటి ఉత్తరాభిముఖంగా కదిలే రోజును వసంత విషువత్ ( స్ప్రింగ్ ఈక్వినాక్స్ ) ఆంటారు. ఆ రోజున రాత్రింబగళ్ళు సరిగ్గా పన్నెండేసి గంటలు. క్రీ.శ. 325 లో అది మార్చి 21న వచ్చింది. 453లో మార్చి 20న, 581లో మార్చి 19కి జరిగిపోతూ వచ్చింది. ఈ వసంత విషువత్తు క్రీ.శ. 1263 నాటికి సౌరసంవత్సరం కంటే జూలియన్ సంవత్సరం 8 రోజులు పెద్దదయింది. ఆ సవత్సరం వసంత విషువత్తు మార్చి పదమూడవ తేదీనే వచ్చింది. క్రైస్తవుల ఈస్టర్ పండుగ ఈ వసంత విషువత్*తో ముడిపడి ఉంది. ఇది ఈ విధంగా జరిగిపోతూ ఉండటంతో ఈస్టర్ పండుగ జరిగిపోతూ వచ్చింది. రోజర్ బేకన్ ఈ సంగతులన్నీ వివరిస్తూ పోపు నాలుగవ అర్బన్*కి 1263లో ఒక ఉత్తరం రాశాడు. కాని, మరో మూడు శాతాబ్దాల దాకా క్రైస్తవ మతాధికారులు ఏ చర్యా తీసుకోలేదు. 1582 నాటికి వసంత విషువత్ మరో రెండు రోజులు ముందుకు జరిగింది. అ ఏడు మార్చి 11 నే వచ్చింది. అప్పుడు పోవు అయిన గ్రిగరీ - పదమూడు, ఇక ఊరుకుంటే లాభం లేదని రంగంలోకి దిగాడు.


    మొట్టమొదటగా ఆ సంవత్సరం అక్టోబర్*లో 10 రోజులు తీసేశాడు. అక్టోబరు 5ని అక్టోబరు 15గా మార్చేఏడూ. దానితో జూలియన్ కేలండర్ సౌర సంవత్సరంతో సమానమయింది. 1583లో వసంత విషవత్తు మళ్ళీ మార్చి 21కి వచ్చేసింది. కాని ఇలాగే ఊరుకుంటే అది మళ్ళీ వెనక్కి జారడం ప్రారంభిస్తుంది. ఈ తేడా 128 సంవత్సరాలకు ఒక రోజు అని చెప్పుకున్నాం. అయితే 384 సంవత్సరాలలో 3 రోజులు, లేదా 4 శతాబ్ధాలకు 3 రోజులు అవుతుంది. ప్రతి నాల్గు వందల సంవత్సరాల్లోను 3 లీపు సంవత్సరాలు వదిలివేస్తే సరి. తూర్పు యూరప్ దేశాలు, రష్యాలోని ఆర్ధడాక్స్ చర్చ్ అప్పటికీ దీన్ని అంగీకరించలేదు. 1917 రష్యన్ బోల్ష్విక్ విప్లవం తర్వాత లెనిన్ గ్రెగోరియన్ కేలెండర్ని అమలుపరిచాడు. అక్టోబర్ 25ని నవంబర్ 7గా మార్చాడు. ఇదీ జూలియన్, గ్రెగోరియన్ కేలెండెర్ కథ.
     
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male

    కల్పము (కాలమానం):



    కల్పం
    అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.

    దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.




    • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
    • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
    • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
    • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు

    • మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
    ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.


    1.jpg



    కల్పముల పేర్లు :


    మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి:

    1. శ్వేత కల్పము
    2. నీలలోహిత కల్పము
    3. వామదేవ కల్పము
    4. రత్నాంతర కల్పము
    5. రౌరవ కల్పము
    6. దేవ కల్పము
    7. బృహత్ కల్పము
    8. కందర్ప కల్పము
    9. సద్యః కల్పము
    10. ఈశాన కల్పము
    11. తమో కల్పము
    12. సారస్వత కల్పము
    13. ఉదాన కల్పము
    14. గరుడ కల్పము
    15. కౌర కల్పము
    16. నారసింహ కల్పము
    17. సమాన కల్పము
    18. ఆగ్నేయ కల్పము
    19. సోమ కల్పము
    20. మానవ కల్పము
    21. తత్పుమాన కల్పము
    22. వైకుంఠ కల్పము
    23. లక్ష్మీ కల్పము
    24. సావిత్రీ కల్పము
    25. అఘోర కల్పము
    26. వరాహ కల్పము
    27. వైరాజ కల్పము
    28. గౌరీ కల్పము
    29. మహేశ్వర కల్పము
    30. పితృ కల్పము
    వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.

     
    Last edited: Feb 23, 2013
  6. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మన్వంతరము :

    హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
    భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.


    మన్వంతరాల పేర్లు :



    1. స్వాయంభువ మన్వంతరము
    2. స్వారోచిష మన్వంతరము
    3. ఉత్తమ మన్వంతరము
    4. తామస మన్వంతరము
    5. రైవత మన్వంతరము
    6. చాక్షుష మన్వంతరము
    7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
    8. సూర్యసావర్ణి మన్వంతరము
    9. దక్షసావర్ణి మన్వంతరము
    10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
    11. ధర్మసావర్ణి మన్వంతరము
    12. భద్రసావర్ణి మన్వంతరము
    13. దేవసావర్ణి మన్వంతరము
    14. ఇంద్రసావర్ణి మన్వంతరము

    వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు :




    1. స్వాయంభువ మన్వంతరము:



    • మనువు - స్వాయంభువు.
    • భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
    • మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
    • మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
    • సప్తర్షులు - మరీచి ప్రముఖులు
    • ఇంద్రుడు - రోచనుడు
    • సురలు - యామాదులు
    • ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.



    2. స్వారోచిష మన్వంతరము:


    • మనువు - స్వరోచికి వనదేవతయందు కల్గిన కుమారుడు.
    • మనువు పుత్రులు - చైతుడు,రోచిష్మదుడు,కింపురుషుడు
    • భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
    • సప్తర్షులు - ఊర్జుడు,స్తంభుడు,ప్రాణుడు,దత్తోళి,ఋషభుడు,నీవారుడు,అరివంతుడు
    • ఇంద్రుడు - విపశ్చింతుడు
    • సురలు - తుషితాదులు
    • సురత చక్రవర్తి వృత్తాంతము



    ౩. ఉత్తమ మన్వంతరము:


    • మనువు - ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
    • మనువు పుత్రులు - భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
    • భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
    • సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
    • ఇంద్రుడు - సత్యజితుడు
    • సురలు - సత్యదేవ శృతభద్రులు



    4. తామస మన్వంతరము:


    • మనువు - ఉత్తముని సోదరుడు తామసుడు.
    • మనువు పుత్రులు - వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
    • భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
    • సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు
    • ఇంద్రుడు - త్రిశిఖుడు
    • సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)



    5. రైవత మన్వంతరము:


    • మనువు - తామసుని సోదరుడు రైవతుడు
    • మనువు పుత్రులు - అర్జున ప్రతినింద్యాదులు
    • భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
    • సప్తర్షులు - హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
    • ఇంద్రుడు - విభుడు
    • సురలు - భూత దయాదులు



    6. చాక్షుష మన్వంతరము:


    • మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
    • మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
    • భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనముశివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు. చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు.
    • సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
    • ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
    • సురలు - ఆప్యాదులు



    7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము:

    ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.

    ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మరియు బుద్ద అవతారములు జరిగినవి, మరియు కల్కి అవతరిస్తారు.



    8. (సూర్య) సావర్ణి మన్వంతరము:

    రాబోయే మన్వంతరము

    • మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
    • మనువు పుత్రులు - నిర్మోహ విరజస్కాదులు
    • భగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
    • సప్తర్షులు - గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
    • ఇంద్రుడు - విరోచన సుతుడైన బలి
    • సురలు - సుతపసులు, విజులు, అమృత ప్రభులు



    9. దక్షసావర్ణి మన్వంతరము:


    • మనువు - వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
    • మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
    • భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
    • సప్తర్షులు - ద్యుతిమంతాదులు
    • ఇంద్రుడు - అద్భుతుడు
    • సురలు - పరమరీచి గర్గాదులు



    10. బ్రహ్మసావర్ణి మన్వంతరము:


    • మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
    • మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
    • భగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
    • సప్తర్షులు - హవిష్మంతుడు మున్నగువారు
    • ఇంద్రుడు - శంభుడు
    • సురలు - విభుదాదులు



    11. ధర్మసావర్ణి మన్వంతరము:


    • మనువు - ధర్మసావర్ణి
    • మనువు పుత్రులు - సత్య ధర్మాదులు పదిమంది.
    • భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
    • సప్తర్షులు - అరుణాదులు
    • ఇంద్రుడు - వైధృతుడు
    • సురలు - విహంగమాదులు



    12. భద్రసావర్ణి మన్వంతరము:


    • మనువు - భద్ర సావర్ణి
    • మనువు పుత్రులు - దేవసుతాదులు
    • భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
    • సప్తర్షులు - తపోమూర్త్యాదులు
    • ఇంద్రుడు - ఋతధాముడు
    • సురలు - పరితారులు



    13. దేవసావర్ణి మన్వంతరము:


    • మనువు - దేవసావర్ణి
    • మనువు పుత్రులు - విచిత్ర సేనాదులు
    • భగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
    • సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు
    • ఇంద్రుడు - దివస్పతి
    • సురలు - సుకర్మాదులు



    14.ఇంద్రసావర్ణి మన్వంతరము


    • మనువు - ఇంద్ర సావర్ణి
    • మనువు పుత్రులు - గంభీరాదులు
    • భగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
    • సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు
    • ఇంద్రుడు - శుచి
    • సురలు - పవిత్రాదులు

     
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    యుగాలు, మహా యుగము:


    దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును

    • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు



    • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
    మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
    ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

    కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.



    యుగాదులు:





    యుగాల మధ్య జరిగిన ఒక కథ:


    భాగవతం ఏకాదశ స్కందము నుండి , ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
    (ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)
    సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకుఒక పగలు. రాత్రి కాలం కూడ అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రంహకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
    బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రంహ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్థుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 306 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగం లో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.
     
  8. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    ఏకవింశతి అవతారములు:


    లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు .


    21 అవతారాలు :

    మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
    శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

    1. బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
    2. వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
    3. నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.
    4. నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
    5. కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
    6. దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
    7. యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
    8. ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
    9. పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
    10. మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
    11. కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
    12. ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
    13. మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
    14. వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
    15. నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
    16. వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
    17. పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.
    18. వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
    19. రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
    20. బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
    21. బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.
    ఇప్పడు :

    కల్కి అవతారము: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై
    జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.




    లీలావతారాలు :



    భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.


    1. వరాహావతారం - భూసముద్ధరణం
    2. సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
    3. కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
    4. దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం
    5. సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం
    6. నరనారాయణావతారం - కామజయం
    7. ధ్రువావతారం - ధ్రువపదారోహం
    8. పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం
    9. ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం
    10. హయగ్రీవావతారం - వేదజననం
    11. మత్స్యావతారం - వేద సంగ్రహం
    12. కూర్మావతారం - మందర ధారణం
    13. ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం
    14. వామనావతారం - బలిరాజ యశోరక్షణం
    15. హంసావతారం - భాగవత యోగోపదేశం
    16. మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం
    17. పరశురామావతారం - దుష్టరాజ భంజనం
    18. రామావతారం - రాక్షస సంహారం
    19. కృష్ణావతారం - లోకకళ్యాణం
    20. వ్యాసావతారం - వేద విభజనం
    21. బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం
    22. కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం

     
    Last edited: Feb 23, 2013
    1 person likes this.
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male

    దశావతారాలు:


    1. మత్స్యావతారము
    2. కూర్మావతారము
    3. వరాహావతారము
    4. నరసింహావతారము
    5. వామనావతారము
    6. పరశురామావతారము
    7. రామావతారము
    8. బలరామావతారము
    9. కృష్ణావతారము
    10. కల్కి అవతారము






    అష్ట దిక్పాలకులు :



    1· ఇoద్రుడు ---- తూర్పు దిక్కు :

    ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

    2· అగ్ని --------- ఆగ్నేయ మూల

    ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము

    ౩· యముడు ------దక్షిణ దిక్కు

    ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

    4· నైఋతి ------- నైఋతి మూల

    ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

    5· వరుణుడు---------- పడమర దిక్కు

    ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.

    6· వాయువు -----------వాయువ్య మూల

    ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

    7· కుబేరుడు -------------- ఉత్తర దిక్కు

    ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

    8· ఈశాన్యుడు -------------ఈశాన్య మూల

    ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.






    షడ్రుచులు:


    1. తీపి
    2. పులుపు
    3. చేదు
    4. కారం
    5. వగరు
    6. ఉప్పు

     
    1 person likes this.
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    చతుర్దశ భువనాలు:


    హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్*పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.




    * లోకాల విభజన :


    లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది.
    బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు. లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే

    • మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
    • రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
    • మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.
    బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు



    * ఊర్ధ్వలోకాలు:



    1. భూలోకం
    2. భువర్లోకం
    3. సువర్లోకం
    4. మహర్లోకం
    5. జనలోకం
    6. తపోలోకం
    7. సత్యలోకం


    *అధోలోకాలు
    :




    1. అతలం=మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం.
    2. వితలం=హాఠకేశ్వరుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు.హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకొంటుంటారు.
    3. సుతలం=బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.
    4. రసాతలం= మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహా సాహసవంతులు.
    5. మహాతలం=కద్రువకు జన్మించిన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళేయుడు, సుషేణుడులాంటి గొప్ప గొప్ప సర్పాలన్నీ గరుత్మంతుని భయంతో బయటకు రారు.
    6. తలాతలం=రుద్రుడి రక్షణలో ఉంటుంది.
    7. పాతాళం=నాగజాతి వారుంటారు. వాసుకి, శంఖుడు, కులికుడు, ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముఫ్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.
    ఈ ఏడు అథోలోకాలు ఒక్కోక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు.అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింప చేస్తుంటాయి. ఇక్కడి వారంతా వ్యాధులకూ, వార్ధక్యానికీ, మానసిక బాధలకూ దూరంగా ఉంటారు.

    లోకాల తత్వం:


    ప్రాణిలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్నిబట్టి మారుతుంది.
    భూర్భువస్వర్లోకాలలో లభించే సుఖం నిత్యమైనది కాదు. నాల్గవదైన మహర్లోకం క్రమముక్తికి స్థానం కాని కల్పాంత సమయాలలో అక్కడా తాపం తప్పదు. మహర్లోకం పైన జనలోకం ఉన్నది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతున్నది. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాస్వతమైనదే కాక క్షేమరూపంలో ఉంటున్నది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతము. మోక్షప్రదము కూడాను.
     
    Last edited: Feb 23, 2013

Share This Page